సర్టిఫికెట్‌లు తెచ్చుకోవడానికి కళాశాలకు వెళ్లిన ఓ డిగ్రీ విద్యార్థిని అదృశ్యమైంది. చప్పల్‌బజార్‌లో నివాసం ఉంటున్న సతీష్‌యాదవ్‌ కుమార్తె కీర్తన(22) మాసాబ్‌ట్యాంక్‌లో జేఎన్‌టీయూ ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. బుధవారం సర్టిఫికెట్‌లు తెచ్చుకోవడానికి కళాశాలకు వెళ్లింది. ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆమె తండ్రి సతీష్‌యాదవ్‌ గురువారం కాచిగూడ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కీర్తన తన స్నేహితులు, కుటుంబ సభ్యులకు తాను మంచి స్థాయిలో స్థిరపడ్డాక కలుస్తానంటూ మెసేజ్‌ పంపినట్లు పోలీసులకు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ మధు తెలిపారు.