అతడు, ఆమె ప్రేమించుకున్నారు కొన్నేళ్ల పాటు వీరి ప్రేమాయణం సాగింది. కాన్ని పెద్దలు నిరాకరిచడంతో ప్రేమ వద్దే ఆగిపోయింది. పెళ్లి వరకు వెళ్లిలేదు చివరకు ఆమె వేరొక అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. కానీ ఆమె తన మాజీ ప్రియుడిని మరవలేకపోయింది. కలుద్దామంటే కుదురదు ఎందుకంటే ప్రస్తుతుం వీరిద్దరు వందల కి.మీ. దూరంలో ఉన్నారు. చివరకు ఓ రోజు ధైర్యం చేసి ఫోన్ చేసి ఇంటికి పిలిచింది. గర్ల్ ఫ్రెండ్ నుంచి ఫోన్ కాల్ రావడంతో అతడు ఎగిరి గంతేశాడు. మరో క్షణం ఆలోచించకుండా వెంటనే ఆమె ఉండే ప్రాంతంలో వాలిపోయాడు. సీన్ కట్ చేస్తే ఆమె మరణించింది. ప్రియుడే హత్య చేశాడు. అసలు ఆ రోజు వీరిద్దరి మధ్యం ఏం జరిగింది.? పెళ్లైన తన మాజీ ప్రియురాలిని ఎందుకు చంపాడు.? ఝార్ఖండ్‌కు చెందిన 21ఏళ్ల పూజకు రాజేష్ వర్మ అనే వ్యక్తితో ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహం జరిగింది. భర్త హైదరాబాద్‌లో పనిచేస్తాడు పెళ్లి తర్వాత ఈ కొత్త జంట జీడిమెట్లలోని వినాయక్ నగర్‌లో కాపురం పెట్టారు. ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. రాజేష్ వర్మ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పూజ గృహిణి ఐతే గతంలోనే ఈమె ఓ యువకుడిని ప్రేమించింది పెద్దలు ఒప్పుకోకపోవడంతో రాజేష్ వర్మను పెళ్లి చేసుకుంది. వివాహం అయినా అతడిని మరచిపోలేకపోయింది. భర్త ఆఫీసుకు వెళ్లగానే తన మాజీ ప్రియుడికి ఫోన్ చేసి మాట్లాడేది. నిన్ను చూడాలలని ఉంది హైదరాబాద్‌కు వస్తావా.? అంటూ ఓసారి ఫోన్ చేసి పిలిచింది.

ఆ కాల్‌ వచ్చిన మరు క్షణమే అతడు, తన స్నేహితుడితో కలిసి హైదరాబాద్‌కు వచ్చాడు. వందల కిలోమీటర్లు ప్రయాణించి జీడిమెట్లకు చేరుకున్నాడు. జీడిమెట్లలో ఓ రహస్య ప్రాంతంలో వీరిద్దరు కలుసుకున్నారు. ”నేను కూడా నిన్ను మరవలేకపోతున్నాను నా వెంట వచ్చెయ్ ఇద్దరం కలిసి ఉందాం” అని ఆ యువకుడు పూజతో చెప్పాడు. ”నాకు పెళ్లైంది అవి సాధ్యం కాదని” ఆమె చెప్పింది. ఇలా అప్పుడప్పుడూ వస్తూ కలవవచ్చని సూచించింది. కానీ అతడు ఒప్పుకోలేదు. ఇలా రహస్యంగా కలవడం నా వల్ల కాదని ఇద్దరం మళ్లీ పెళ్లి చేసుకొని హాయిగా ఉందని అతడు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అందుకు పూజ ఒప్పుకోకపోవడంతో ఆ యువకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోపంతో ఊగిపోతూ క్షణికావేశంలో ఆమెను చంపేశాడు. దిండుతో ఊపిరాడకుండా చేయడంతో ఆమె మరణించించింది. అనంతరం భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. పూజ భర్త రాజేష్ శర్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.