బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని సీక్రెట్ ఆఫ్ హెయిర్ అండ్ ఫ్యామిలీ సెలూన్‌లో మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు దాడులు చేసి యజమానిపై కేసు నమోదు చేయడమే కాకుండా సెలూన్‌ను సీజ్ చేశారు. పూర్తి వివరాలు: గత కొంత కాలంగా రోడ్ నెం. 2లో ప్రకాశ్ అనే వ్యక్తి ఫ్యామిలీ సెలూన్ నిర్వహిస్తూ వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి క్రాస్ మసాజ్ చేయిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఎస్‌ఐ ఎస్.కరుణాకర్‌రెడ్డి సంబంధిత సిబ్బందితో కలిసి సెలూన్‌పై దాడి చేశారు. మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. నిబంధనల ప్రకారం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా సదరు నిర్వాహకుడు ఏర్పాటు చేయలేదు. GHMC ట్రేడ్ లైసెన్స్ లేకుండానే ఈ సెలూన్‌ను నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు.
మసాజ్ థెరపిస్ట్‌లు, బ్యూటీషియన్ల పేరుతో వివిధ ప్రాంతాల నుంచి పది మంది యువతులను రప్పించి వ్యభిచారానికి పాల్పడుతున్నట్లుగా విచారణలో తేలింది. సెలూన్ యజమాని ప్రకాశ్‌పై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 10లో సోనాలిసింగ్ అనే బ్యూటీషియన్ కొంత కాలంగా మహి ఆయుర్వేది వెల్‌నెస్ ఫ్యామిలీ సెలూన్ పేరుతో స్పాను నిర్వహిస్తుండగా ఇందులో మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న బంజారాహిల్స్ ఎస్‌ఐ మనోజ్ కుమార్ దాడులు నిర్వహించారు. ఈ సెలూన్ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నట్లుగా గుర్తించారు. స్పా ముసుగులో ఈ కేంద్రాన్ని వ్యభిచార గృహంగా మార్చినట్లుగా తనిఖీల్లో వెల్లడైంది. నిర్వాహకురాలిపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.