వినాయక ఉత్సవాలు వచ్చేయంటే చాలు గ్రామాలు, పట్టణ ప్రజలు ఎనలేని ఆనందాలతో సంబరాలు చేసుకుంటారు. అందులోనూ గణేషుని లడ్డూ వేలం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. కాగా ప్రతి ఏటా లడ్డూ వేలం భారీ ధరకు చేరుకోవడం చూస్తూనే ఉన్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా అధిక ధరలో లడ్డూ వేలం పాటలు జరిగాయి. అందులో బాలాపూర్ బంగారు లడ్డూను వ్యాపారి వంగేటి లక్ష్మారెడ్డి దాదాపు 24.6 లక్షలకు దక్కించుకున్నారు. అయితే ఈ లడ్డూ మాత్రేమే భారీ ధరకు చేరిందని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. కానీ, ఈ లడ్డూ కంటే కూడా మరో గణేషుని లడ్డూ వేలం భారీ ధరకు పలికింది.

హైదరాబాద్ నగరంలోని ఆల్వాల్‌లో కనాజిగూడ మరకత గణేషుని లడ్డూ వేలం బాలాపూర్ లడ్డూను బ్రేక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. వేలంలో సుమారు రూ. 46లక్షలు (45,99,999)కు వెంకట్‌రావు అనే వ్యక్తి ఈ లడ్డూను దక్కించుకున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల లడ్డూ వేలంలో ఇదే భారీ ధర పలకడం గమనర్హం.