{"subsource":"done_button","uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1594145674320","source":"other","origin":"gallery","source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1594145674326"}

భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడనే విషయం తెలుసుకున్న ఓ మహిళ దానిని జీర్ణించుకోలేకపోయింది. ఈ విషయంలో భర్తను నిలదీసింది. అయినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాకడంతో మనస్తాపం చెంద ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పఠాన్‌చెరు రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు: ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన రామలక్ష్మికి మూడేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన వెంకటరెడ్డితో వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్నం కింద వెంకటరెడ్డికి 50 గ్రాముల బంగారం, ఎకరం భూమి, కొంత నగదు ఇచ్చారు. వీరిద్దరు ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లలోని రామచంద్రపురంలో నివాసం ఉంటున్నారు. వెంకటరెడ్డి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. వీరికి రెండేళ్ల పాప కూడా ఉంది. కొన్నాళ్ల పాటు వెంకటరెడ్డి, రామలక్ష్మిల దాంపత్య జీవితం బాగానే సాగింది. అయితే వెంకటరెడ్డి తాను పనిచేసే కంపెనీలో ఓ అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. భార్యకు తెలియకుండా ఆమెతో చాట్ చేస్తూ ఉండేవాడు. ఈ విషయం తెలుసుకున్న రామలక్ష్మి భర్తను నిలదీసింది. అలాగే ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు కూడా తెలియజేసింది. ఈ క్రమంలోనే వెంకటరెడ్డి తాను ఆ అమ్మాయితో చాటింగ్ చేయనని హామీ ఇచ్చారు.

ఇక, సంక్రాంతికి పండగకు పుట్టింటికి వెళ్లిన రామలక్ష్మి, ఆదివారం తిరిగి రామచంద్రపురానికి తిరిగి వచ్చింది. అయితే భర్త ఇంకా ఆ అమ్మాయితో చాటింగ్ చేస్తున్నట్టుగా రామలక్ష్మి గుర్తించింది. ఆ మెసేజ్‌లను తన చెల్లకి ఫార్వర్డ్ చేసింది. అనంతరం ఆమెకు ఫోన్ చేసి బామ మారలేదని తాను చనిపోతున్నానని చెప్పింది. దీంతో కంగారు పడిపోయిన రామలక్ష్మి చెల్లలు తిరిగి ఫోన్ చేసింది. అయితే ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఈ విషయాన్ని తల్లిదండ్రలుకు తెలియజేసింది. ఇక, వెంకటరెడ్డి సోమవారం ఉదయం ఫోన్ చేసి రామలక్ష్మి బెడ్ రూమ్‌లో ఉరివేసుకుని చనిపోయిందని చెప్పారని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. మరో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని తమ కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వెంకటరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని రామలక్ష్మి తల్లిదండ్రులు కోరుతున్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.