ప్రపంచం ఆధునికంగా చాలా ముందుకిపోతుంది. రోజురోజుకి దేశం ఎంతో పురోగతి సాధించినప్పటికీ, మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఏ మాత్రం తగ్గడంలేదు. ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట మహిళపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కొత్త కొత్త చట్టాలు ఎంతమంది పోలీసులు ఉన్నా కూడా కామాంధుల కళ్లకి ఎంతోమంది యువతులు బలైపోతున్నారు. కొన్ని కొన్ని చోట్ల కంటికి రెప్పలా కాపాడాల్సిన తమ పిల్లలపై కన్నేసి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి తమ్ముడి కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు చూస్తే:

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో నివసించే వ్యక్తి దంత వైద్యుడిగా సేవలు చేస్తున్నాడు. అతడి ఇంటికి సమీపంలోనే తమ్ముడు కూడా కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తమ్ముడి కూతురిపై డాక్టర్ కన్నేశాడు.ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతి ఇంటికి రాగా బెదిరింగి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ విషయాన్ని బయటికి చెబితే చంపేస్తానని బెదిరించాడు. తనపై పెదనాన్నే అఘాయిత్యానికి పాల్పడటంతో కొద్దిరోజుల పాటు కుమిలిపోయిన యువతి ఎట్టకేలకి షీటీమ్స్ కి ఫిర్యాదు చేసింది. డాక్టర్గా పని చేస్తున్న తన పెద్దనాన్నే పలు మార్లు తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు యువతి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి డాక్టర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని తెలిపారు ఏసీపీ నర్సింహారావు తెలిపారు.