దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉన్నందున క్రైమ్‌ రేటు పూర్తిగా తగ్గిపోయింది. బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు, రోడ్డు ప్రమాదాలు ఇలా ఎన్నో దారుణాలు తగ్గిపోయాయి. తాజాగా హైదరాబాద్‌లో ఓ దళిత మైనర్‌ బాలికపై దారుణం చోటు చేసుకుంది. పాతబస్తీ పరిధిలోని చాదర్‌ ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ మైనర్‌ బాలికపై ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. చాలా రోజుల తర్వాత మళ్లీ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది.

చాదర్ ఘాట్ కమలానగర్ లో ఓ బాలికపై ఎంఐఎం నేత అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎంఐఎం నేత షకీల్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనలో బాధితురాలిని బీజేపీ నేతలు, దళిత సంఘాలు పరామర్శించాయి. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నాయి. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ: పాతబస్తీలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. షకీల్ కు ఎంఐఎం అండగా ఉందని ఆరోపించారు. కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించాలని డిమాండ్ చేశారు.

కాగా బాధితురాలిని పరామర్శించడానికి ఎంఐఎం ఎమ్మెల్యే బలాలా కుడా వెళ్లారు. కానీ అక్కడ స్థానికులు అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. దీంతో ఆయన మీడియాతో మాటాడుతూ నిందితుడికి తమ పార్టీకి సంబంధం లేదన్నారు. పార్టీ జండా పట్టుకుని ఫోటో దిగితే మా పార్టీ అయిపోతారా అన్నారు. ప్రధాని మోదీ ఫొటోను విజయ్ మాల్యా పెట్టుకున్నారని, అంత మాత్రాన మోదీని విమర్శిస్తే ఎలాగని ప్రశ్నించారు. మేం బాధితురాలికి అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.