గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఓయో ఉద్యోగిని మౌనిక(25) ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టానికి తరలించారు. 

వివరాలు: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓయో ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. కొండాపుర్‌లోని కాకతీయ రెసిడెన్సీలో స్నేహితులతో కలిసి మౌనిక (25) అనే యువతి నివాసముంటోంది. హరియాణా గురుగ్రామ్‌కు చెందిన ఆమె ఓయోలో ఉద్యోగం చేస్తోంది. మౌనిక మంగళవారం తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె సూసైడ్‌కు కారణాలు తెలియాల్సి ఉంది. పోస్ట్‌మార్టం నిమిత్తం మౌనిక మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.