హైదరాబాద్ లో ఓ హాటల్ బయటకు పెద్దహోటల్, లోపల మాత్రం బ్రోతల్ బిజినెస్. అంతరాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. వివిధ రాష్ట్రాలనుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారంచేస్తునారు. గుట్టుగా జరుగుతున్న వ్యాపారం ఇటీవల బయటపడి , పోలీసు దాడులతో గుట్టురట్టయింది. గచ్చిబౌలి కొండాపూర్‌ శ్రీరాంనగర్‌ కాలనీలో హోటల్ ముసుగులో జరుగుతున్న వ్యబిచారం కూపం పాపం బట్టబయలైంది. ఈ దాడిలో ఆరుగురు విటులతో పాటు ఆరుగురు యువతులను అదుపులోకి తీసుకోగా, హోటల్ నిర్వాహకులు మాత్రం పరారీలో ఉన్నారు. హోటల్లో దాడుల్లో పట్టుబడ్డ అమ్మాయిల్లో పశ్చిమబెంగాల్‌కు చెందిన ముగ్గురు, ముంబైకి చెందిన ఇద్దరు, ఢిల్లీకి చెందిన ఒక యువతిని అదుపులోకి తీసుకొని రెస్క్యూ హోంకు తరలించారు. వ్యభిచార హోటల్ నిర్వాహకులు ప్రభాకర్, సంజయ్, అజయ్‌ పరారీలో ఉన్నారు.