రెండు నెలల క్రితం క్రైమ్స్ కంట్రోల్ లో ఉన్నా, మళ్లీ మృగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా అన్నం పెట్టిన మహిళ పైనే సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమెను అన్యాయంగా కడతేర్చారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని జియాగూడలో ఈనెల 7న మంగళవారం రాత్రి చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో జియాగూడ కేశవస్వామి నగర్‌కు చెందిన ఆండాళ్(47) అనే మహిళ గత కొంత కాలంగా జీయా గుడాలో మేకల మార్కెట్ లో మేకలు అమ్మడం, కొనడం లాంటి వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తుంది. ఆమెకు భర్త కూడా సహాయంగా ఉంటున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు. ఇక జియాగూడ కేశవస్వామి నగర్‌లో సొంతిల్లు నిర్మించింది. ఈ క్రమంలోనే కూలీలకు దావత్ ఇవ్వాలని అందరినీ పిలిచి సంతోషంగా విందు ఏర్పాటు చేసింది.

ఈ విందుకు మేస్త్రీ స్నేహితుడు రవి కూడా హాజరయ్యాడు. అయితే వారికి భోజనం పెట్టిన అనంతరం ఆండాలు నిద్రపోవడానికి మొదటి అంతస్థుకు వెళ్ళారు. ఆమె వెళ్లడం మేస్త్రీ స్నేహితుడు రవి గమనించి, ఆమెను వెంబడించాడు. మొదటి అంతస్థులోకి వెళ్లి ఆమె అలసిపోయి పడుకోవడం గమనించాడు. ఆమె నోరు మూసి అత్యాచారానికి పాల్పపడ్డాడు. దాంతో ఆమె ఊపిరి ఆడక చనిపోయింది. ఆ సమయంలో ఆండాళ్ కుమారుడు వెళ్లగా అతడిని నెట్టివేసి రవి అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితున్ని పట్టుకోవడానికి తీవ్రంగా గాలిస్తున్నారు.