{"uid":"EA9684FB-092A-4DFE-B413-F44AFB16F789_1625577375119","source":"other","origin":"gallery"}

బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ విడాకులు ఇప్పుడు దేశ‌మంత‌టా హాట్ టాపిక్‌గా మారాయి. దాదాపు 15ఏళ్లు అన్యోన్యంగా ఉన్న ఈ దంప‌తులు అక‌స్మాత్తుగా ఎందుకు విడిపోతున్నార‌నే దానిపై బాలీవుడ్‌లో చ‌ర్చ మొద‌లైంది. ఈ క్ర‌మంలోనే సోష‌ల్‌మీడియాలో ఓ వార్త తెగ వైర‌ల్ అవుతోంది. బాలీవుడ్ న‌టి ఫాతిమా స‌నా షేక్‌తో లింక్ ఉంద‌ని అందుకే కిర‌ణ్‌రావుతో విడాకులు తీసుకుంటున్నాడ‌ని వార్తలు గుప్పుమంటున్నాయి. త్వ‌ర‌లోనే వీళ్లిద్ద‌రూ పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌ని ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. దీనిపై ట్విట‌ర్‌లో పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. దంగల్ సినిమాలో ఫాతిమా స‌నా షేక్ అమీర్ ఖాన్ కుమార్తెగా న‌టించింది. ఆ త‌ర్వాత వెంట‌నే అమీర్ ఖాన్‌తో మ‌రో చిత్రంలో న‌టించే అవ‌కాశాన్ని కొట్టేసింది. థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్‌లో అమీర్ సర‌స‌న న‌టించే అవ‌కాశం ద‌క్క‌డంపై అప్ప‌ట్లో ప‌లు రూమర్లు వ‌చ్చాయి.

ఫాతిమాతో అమీర్‌కు ఎఫైర్ ఉంద‌ని అందుకే ఆమెకు రెండో సినిమాలో అవ‌కాశం ఇచ్చాడ‌ని గుస‌గుస‌లు వినిపించాయి. ఆ సినిమా త‌ర్వాత కూడా ఫాతిమా ముంబైకి వ‌చ్చిన ప్ర‌తిసారి అమీర్‌ను క‌చ్చితంగా క‌లుస్తుంద‌ని ఇద్ద‌రూ క‌లిసి చాలా పార్టీల‌కు వెళ్లేవార‌ని బాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. చివ‌రికి అంబానీ ఇంట్లో జ‌రిగిన పార్టీకి, అవార్డుల వేడుల వ‌ద్ద కూడా వీళ్లు జోడీగా క‌నిపించ‌డంతో ఈ వార్త‌ల‌కు బ‌లం చేకూరింది. కానీ అప్ప‌ట్లో ఆ వార్త‌ల‌ను అమీర్ ఖాన్ లైట్ తీసుకోగా ఫాతిమా మాత్రం త‌న గురించి అలా త‌ప్పుగా రాయ‌డం స‌రికాద‌ని చెప్పింది. అయితే ఇప్పుడు అమీర్‌ఖాన్ విడాకులు తీసుకుంటుండ‌టంతో మ‌రోసారి ఫాతిమా పేరు తెర‌పైకి వ‌చ్చింది.

ప్రస్తుతం 29 ఏళ్లు ఉన్న ఫాతిమా హైద‌రాబాద్‌లో జ‌న్మించింది. ఆమె తల్లి రాజ్ త‌బుస్సుమ్ శ్రీన‌గ‌ర్‌కు చెందిన ముస్లిం. తండ్రి విపిన్ శ‌ర్మ క‌శ్మీర్‌కు చెందిన హిందూ. ఈమె చాచి 420, వ‌న్ 2 కా 4 వంటి చిత్రాల్లో బాల‌న‌టిగా న‌టించింది. నువ్వు నేను ఒక‌ట‌వుదాం చిత్రంతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైంది. 2015లో విడుద‌లైన ఈ చిత్రం వ‌చ్చిన‌ట్టు కూడా ఎవ‌రికీ తెలియ‌దు. ఆ త‌ర్వాత దంగల్ సినిమాలో అవ‌కాశం రావ‌డంతో పాపుల‌ర్ అయిపోయింది.