ఉత్తర్‌ప్రదేశ్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఆగ్రాలో తన భార్య, మరో యువకుడితో వెళ్తుండగా, ఆమె భర్త గమనించాడు. దీంతో ఆమెను ఆగాలని రోడ్డుపైనే మరో వెహికిల్ మీద వారిని చేజ్ చేశాడు. అంతే కాకుండా రోడ్డుమీద వారితో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. పోలీసుల ప్రకారం: యూపీకి చెందిన సికిందర్ అనే వ్యక్తికి, పదేళ్ల క్రితంపెళ్లి జరిగింది. వీరికి ఒక పాప కూడా ఉంది. అయితే, ఇతని స్నేహితుడు బియ్యం వ్యాపారం చేస్తుండేవాడు. ఇతను తరచుగా ఇంటికి వస్తుండేవాడు. ఈ క్రమంలో వీరి మధ్య పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.

దీంతో వివాహిత, స్నేహితుడితో కలిసి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె కోసం సికిందర్ ఎంతగానో వెతుకుతున్నాడు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఆగ్రాకి వెళ్లాడు. అక్కడ రోడ్డు మీద తన భార్య స్కార్ఫ్ వేసుకుని మరో యువకుడితో వెళ్లడం గమనించాడు. వెంటనే స్కూటీపైన ఆమెను వెంబడించాడు. ఆమెను రోడ్డుమీద నిలదీశాలు. దీంతో ఇద్దిరికి వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారింది.