మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. దయాకర్‌రావు పీఏతో పాటు ఇద్దరు గన్‌మన్లు, ఒక కానిస్టేబుల్‌, డ్రైవరు, మరో సహాయకుడికి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యింది. ఈనెల 21న వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని మంత్రి స్వగృహంలో ఆయన వెంట ఉన్న పీఏలు, గన్‌మన్లు, సహాయకులు మొత్తం 40 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో ఆరుగురికి పాజిటివ్‌ అని తేలింది. వీరికి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.