శృంగారం అన్నది మంచిదే, కానీ అది శృతిమించితే అనర్ధాలు వస్తాయి. మరణం కూడా సంభవించవచ్చు, సోషల్ మీడియాలో పరిచయామైన ఓ వ్యక్తితో కలిసి 19 ఏళ్ల యువతి హోటల్ గదికి వెళ్ళింది. అలా హోటల్ గదికి వెళ్లిన ఆ యువతి గదిలోనే మరణించింది. కారణం ఓవర్ బ్లీడింగ్, అయితే, ఓవర్ బ్లీడింగ్ జరగడానికి కారణం ఏంటి అన్నది తెలియాల్సి ఉన్నది. ఈ సంఘటన కేరళలోని కొచ్చిన్ లో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే: కేరళలోని అలప్పుఝా కు చెందిన 19 ఏళ్ల యువతి ఇంటర్వ్యూ ఉందని చెప్పి ఈనెల 12 వ తేదీన కొచ్చిన్ వచ్చింది. కొచ్చిన లో తనకు పరిచయమైనా గోకుల్ ను కలిసింది. ఇద్దరు కలిసి హోటల్ రూమ్ తీసుకున్నారు. రూమ్ లో శృంగారంలో మునిగిపోయారు. కాసేపటి తరువాత లోపలి నుంచి పెద్దగా అరుస్తూ గోకుల్ బయటకు వచ్చాడు. అప్పటికే ఆ యువతి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఓవర్ బ్లీడింగ్ జరిగింది. వెంటనే ఆ యువతిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ, ఆ యువతి అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఈ కేసులో పోలీసులు గోకుల్ ను అదుపులోకి తీసుకున్నారు….