సోషల్ మీడియా ఫ్రెండ్షిప్ లు ఎంతటి అనర్థానికి దారి తీస్తాయో చెప్పే ఉదాహరణ ఇది. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన స్నేహితుల్ని నమ్మి, వారితో మాటలు కలిపి చివరకు మానభంగానికి గురైంది ఆ యువతి. 17ఏళ్లకే ఆ యువతికి వారిద్దరూ టార్చర్ చూపించారు. హోటల్ గదికి రావాలని నమ్మకంగా పిలిచి దారుణానికి తెగబడ్డారు. ఈ ఘటన బీహార్ లోని పాట్నాలో జరిగింది. పాటలీపుత్ర ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలికకు సోషల్ మీడియా ద్వారా పర్వేజ్, రంజాన్ అనే యువకులు పరిచయమయ్యారు.

ఆ ఇద్దరితో బాలిక రోజూ చాటింగ్ చేసేది. కొద్ది రోజులకు ఫోన్ ద్వారా మాటలు కలిశాయి. ముగ్గురూ తరచుగా మొబైల్ ద్వారా మాట్లాడుకునేవారు. నేరుగా మాట్లాడుకోవాలని స్నేహితులిద్దరూ కోరగా ఆ అమ్మాయి ఓకే చెప్పింది. ఓయో యాప్ ద్వారా పాట్నాలో రూమ్ బుక్ చేశారు. స్నేహితులే కదా అని వెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాక వారిద్దరూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తర్వాత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ బాలికకు మెడికల్ టెస్ట్ చేయించి ఆమె స్టేట్‌మెంట్‌ ను రికార్డు చేసుకున్నారు. రంజాన్, పర్వేజ్‌పై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.