ఇండియాన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) సీజన్‌- 13 పూర్తి షెడ్యూల్‌ వచ్చింది. మార్చి 29న నుంచి ఐపీఎల్ ప్రారంభంకానుంది. కాగా.. మార్చి 29న తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల జరగనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా మ్యాచ్ జరగనుంది. రెండో మ్యాచ్‌ మార్చి 30న దిల్లీ క్యాపిటల్స్‌, కింగ్స్‌ XI పంజాబ్‌ జట్ల మధ్య, అలాగే 31న రాయల్‌ ఛాలెంజర్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మూడో మ్యాచ్ జరుగుతుంది.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తొలి మ్యాచ్‌ ముంబయి ఇండియన్స్‌తో ఏప్రిల్‌ 1న తలపడనుంది. ఈ సీజన్ లో మొత్తం 56 మ్యాచ్‌లు జరగనుండగా.. అందులో ప్రతీ ఆదివారం రెండేసి మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు షెడ్యూల్లో ప్రకటించింది. గతేడాది హైదరాబాద్‌లో జరిగిన ఫైనల్లో ముంబయి ఇండియన్స్‌ ఒక్క పరుగుతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ముంబయి నాలుగోసారి టైటిల్‌ సాధించి చరిత్ర సృష్టించింది. మ్యాచ్చులకు సంబంధించి పూర్తి వివరాలను ఐపీఎల్‌ నిర్వాహకులు అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించారు. ఇప్పటి వరకు ముంబై నాలుగు సార్లు టైటిల్ సొంతం చేసుకోగా…చైన్నై సూపర్ కింగ్స్ మూడు సార్లు, కోల్‌కత్తా 2, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 1, హైదరాబాద్‌ పాత ఫ్రాంచైజీ డెక్కన్ చార్జర్స్ (1), రాజస్థాన్ రాయల్స్ జట్టు ఒక సారి టైటిల్ సొంతం చేసుకున్నాయి.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్ వివరాలు..

(ఏప్రిల్‌ 1) ముంబై ఇండియన్స్

(ఏప్రిల్‌ 4) కింగ్స్ ఎలెవన్ పంజాబ్

(ఏప్రిల్‌ 7) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

(ఏప్రిల్‌ 12) రాజస్థాన్ రాయల్స్

(ఏప్రిల్‌ 16) కోల్ కత్తా నైట్ రైడర్స్

(ఏప్రిల్‌ 19) చైన్నై సూపర్ కింగ్స్

(ఏప్రిల్‌ 21) రాజస్థాన్ రాయల్స్

(ఏప్రిల్‌ 26) ఢిల్లీ క్యాపిటల్స్

ఏప్రిల్‌ 30) చైన్నై సూపర్ కింగ్స్

(మే 03) ఢిల్లీ క్యాపిటల్స్

(మే 05) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

(మే 09) ముంబై ఇండియన్స్

(మే 12) కింగ్స్ ఎలెవన్ పంజాబ్

(మే 15) కోల్ కత్తా నైట్ రైడర్స్

జట్లతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనుంది. హైదరాబాద్‌ తన ‘హోం’ మ్యాచ్‌లను ఎప్పటిలాగే ఉప్పల్‌ స్టేడియంలో ఆడనుంది. హైదరాబాద్‌లో ఈ ఏడు మ్యాచ్‌లు ఏప్రిల్‌ 1, 12, 16, 26, 30, మే 5, 12 తేదీల్లో జరుగుతాయి.