sorry I am not supposed to tell you this..

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ సిటీ పోలీసులు ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి వినూత్నంగా ఆలోచించారు. ఆన్‌లైన్‌ మోసాలపై అవగాహన కల్పించడానికి భారత వైమానిక దళ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ చెప్పిన డైలాగ్‌తో ప్రచారం చేశారు.
పాక్‌ సైనిక అదికారులు అభినందన్‌ను విచారిస్తున్న సమయంలో తన మిషన్‌ గురించి వివరాలు రాబట్టడానికి ఎంతగానో ప్రయత్నించారు. వారు ఎంతగా ప్రయత్నించిన అభినందన్‌ మాత్రం ‘అవన్నీ నేను మీకు చెప్పకూడదు (I am not supposed to tell you this)’ అంటూ సమాధానం ఇచ్చారు. అలాగే వ్యక్తిగత వివరాలు అడిగినప్పుడు కూడా తాను శత్రు దేశం చెరలో ఉన్నానని భయపడకుండా, ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా సమాధానం దాటవేసి దేశభక్తిని చాటుకున్నారు.
అయితే నాగ్‌పూర్‌ పోలీసులు ‘OTP’లతో జరుగుతున్న మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి అభినందన్‌ చెప్పిన మాటలను ఉపయోగించారు. ఇకపై ఎవరైనా ఫోన్‌ చేసి ఓటీపీ అడిగితే.. అభినందన్‌ చెప్పినట్టు ఈ వివరాలు నేను మీకు చెప్పకూడదనే సమాధానం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు సూచించారు. ఈ మేరకు నాగ్‌పూర్‌ పోలీసుల చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. పోలీసులు ప్రయత్నంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.