{"source":"other","uid":"2B42303B-2021-4A00-9841-243360D6BB92_1641477272861","origin":"gallery","is_remix":false,"used_premium_tools":false,"used_sources":"{"sources":[],"version":1}","premium_sources":[],"fte_sources":[]}

టిక్‌టాక్‌లో వీడియోలు చేసుకుంటూ ఫేమస్ అయిన తిరుచ్చి సాధన అనే మహిళ న్యూ ఇయర్ సందర్భంగా తన యూట్యూబ్ ఛానల్‌లో, ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. హాట్ హాట్‌గా అందాలు చూపిస్తూ పాపులారిటీ తెచ్చుకున్న తిరుచ్చి సాధన అమ్మవారి గెటప్‌లో కనిపించేసరికి వీడియో చూసిన వారంతా అవాక్కయ్యారు. తిరుచ్చి సాధన కూడా ‘అన్నపూర్ణి’లా మాతగా మారిపోయిందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. అర్ధనగ్నంగా కనిపిస్తూ, కుర్రకారును రెచ్చగొట్టేలా వీడియోలు చేసి పాపులారిటీ తెచ్చుకున్న తిరుచ్చి సాధన అమ్మవారి గెటప్‌లో కనిపించడంపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు భగ్గుమన్నారు. ఇలాంటి వారంతా హిందూ దేవతలను కించపరుస్తున్నారని మండిపడ్డారు. దీంతో తన వీడియోపై తిరుచ్చి సాధన స్పందించింది.

తమిళనాడులో ‘అన్నపూర్ణి’ అంశం హాట్ టాపిక్‌గా మారడంతో తాను కూడా ఇలా గెటప్ వేశానని మాతగా మారడం తన ఉద్దేశం కాదని చెప్పింది. యూట్యూబ్ ఛానల్ ద్వారా తాను డబ్బు సంపాదిస్తున్నానని, ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్‌పై వీడియో చేస్తే వ్యూస్ ఎక్కువగా వస్తాయన్న ఉద్దేశంతోనే వీడియో చేశానని ఆమె తెలిపింది. మాతగా మారడం అనేది అన్నపూర్ణి వ్యక్తిగత నిర్ణయమని, ఆమెను నమ్మేవారు నమ్ముతారు, నమ్మని వారు నమ్మరని చెప్పింది. అయితే, ఇలా యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించడం కోసం హిందూ దేవతల రూపాల్లో కనిపిస్తే మర్యాదగా ఉండదని కొందరు నెటిజన్లు తిరుచ్చి సాధనను హెచ్చరించారు. భారత్‌లో టిక్‌టాక్ అందుబాటులో ఉన్న సమయంలో వీడియోలు చేసి పాపులర్ అయిన వ్యక్తుల్లో తిరుచ్చి సాధన ఒకరు. హాట్‌హాట్‌గా కనిపిస్తూ ఆమె చేసే వీడియోలకు కుర్రకారు నుంచి మంచి స్పందన వచ్చింది. టిక్‌టాక్ బ్యాన్ కావడంతో తిరుచ్చి సాధన కూడా ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్ బాట పట్టింది. ఇన్‌స్టాగ్రాంలో ఆమెకు 2 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్‌లో కూడా లక్షా 88 వేల మంది ఆమె ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. ఆమె చేస్తున్న వీడియోలకు వ్యూస్ కూడా చెప్పుకోదగ్గ విధంగానే ఉన్నాయి.