అవసరమైతే ఇంకా అప్పులు చేస్తామని, కొంపలేమీ మునిగిపోవని, రాష్ట్రం బాగుపడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు. అభివృద్ధి కోసం అప్పులు తేక తప్పదని, తాము మాత్రమే అప్పులు చేయలేదని, గత ప్రభుత్వాలు కూడా అప్పులు చేశాయని పేర్కొన్నారు. అప్పులు ఎందుకు తెచ్చామో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తన మీద ఉందని, కేంద్రంలో కాంగ్రెస్‌‌, బీజేపీ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌, టీడీపీ పాలన తాలూకు దుష్ట అనుభవాలను తాము సర్దలేక సచ్చిపోతున్నామని కేసీఆర్​ అన్నారు.

గతంలో పాలించిన వాళ్లు ఇంటికో ఉద్యోగం ఇచ్చి ఉంటే తాము ఉద్యోగాలు ఇవ్వాల్సిన పరిస్థితే తలెత్తేది కాదని తెలిపారు. రైతులు బ్యాంకుల్లో తీసుకున్న అప్పులను ముందే కట్టేసుకోవాలని, నాలుగు విడతల్లో లక్షలోపు రుణాల మాఫీ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. సర్పంచ్‌‌, ఉప సర్పంచ్‌‌లకు జాయింట్ చెక్‌‌పవర్ కొనసాగుతుందని, వీఆర్వోలను తొలగించాల్సి వస్తే తొలగిస్తామని, ఎవరికీ భయపడమని తేల్చిచెప్పారు. ద్రవ్యవినిమయ బిల్లుపై ఆదివారం అసెంబ్లీలో జరిగిన చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్​ సుదీర్ఘంగా బదులిచ్చారు. కాంగ్రెస్​, బీజేపీపై విరుచుకుపడ్డారు.ఆదివారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్​ సుదీర్ఘంగా ప్రసంగించారు…