బాలీవుడ్ బ్యూటీ కీర్తి కుల్హారి ‘ముద్దు’ ముచ్చట్లు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆమె తన ఆన్ స్క్రీన్ కిస్ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు నెటిజన్స్‌లో కొత్త ఎగ్జైట్మెంట్‌కు కారణం అయ్యాయి.
‘హ్యూమన్’ అనే షోలో నటించింది కీర్తి. అయితే, అందులో ఆమె సీనియర్ నటి షెఫాలీ షాతో లిప్ లాక్ చేసేసింది! అదే కొంత వరకూ ఆశ్చర్యం కలిగించే సంగతైతే మరింత షాకిచ్చేలా, సదరు కిస్ షూట్ చేస్తోన్న సమయంలోని తన అనుభూతుల్ని మీడియాతో పంచుకుంది కీర్తి. ”ఆ సమయంలో నాకు ఒకే ఆలోచన మనసులో మెదిలింది, ఒకవేళ నాకు మూడొచ్చేస్తే.? కానీ, మళ్లీ నేనే కొంచెం వెనక్కి మళ్లి ఆలోచించాను ఏంటి, నేను మరో స్త్రీని ఇష్టపడుతున్నానా.? అంటూ ముద్దు గురించిన ముచ్చట్లు చెప్పింది కీర్తి కుల్హారి. కాకపోతే, షెఫాలీతో చుంబనం కాస్తా పూర్తయ్యాక కీర్తి ‘హమ్మయ్యా’ అనుకుని ఊపిరిపీల్చుకుందట.

ఎందుకంటే, ”దేవుడి దయ వల్ల నాకు ఎలాంటి ఫీలింగు కలగలేదు” అని తన మానసిక స్థితిని వివరించింది యంగ్ బ్యూటీ గతంలో హీరో, హీరోయిన్ ముద్దాడితేనే జనం ముక్కున వేలేసుకునే వారు. ఓటీటీల రాకతో ముద్దులు సెన్సార్ ఇబ్బందులు లేకుండా హద్దులు దాటేస్తున్నాయి. దాంతో ఇప్పుడిప్పుడే ఎదుగుతోన్న కీర్తి కుల్హారి లాంటి యువ కథనాయికలకి అప్పుడప్పుడూ కంగారు తప్పటం లేదు.! చూడాలి మరి, ‘హ్యూమన్’ వెబ్ సిరీస్‌లో కిస్సింగ్ సీన్ పోనుపోను ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో.