జిల్లా అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు ఆర్టీసీ ఉద్యోగులు నిర్భయంగా డ్యూటీలో చేరవచ్చు. ఆర్టీసీ ఉద్యోగులపై బెదిరింపులు, భౌతికదాడులు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీనివాసులు అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ నెల 5వ తేదీ లోపు ఆర్టీసీ ఉద్యోగులను విధులలో చేరడానికి అవకాశం కల్పించిన నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్న వారికి పోలీస్ శాఖ నుండి పూర్తి రక్షణ, భద్రత కలిపిస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు అన్నారు.

బెదిరింపులు పాల్పడితే

తెలంగాణ ప్రభుత్వం పిలుపుమేరకు ఉద్యోగులు నిర్భయంగా విధుల్లో చేరవచ్చని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులపై బెదిరింపులు, భౌతికదాడులకు పాల్పడితే వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. డయల్ 100 పోలీస్లకు సంప్రదించాలన్నారు.