ఆ నియోజికవర్గం లో అభ్యర్థిని మార్చకుంటే తెరాస ఓటమి తప్పదు

అసమ్మతి గ్రూపు వారి తరఫున ఒకరిని ఇండిపెండెంట్‌గా బరిలో నిలబెట్టాలనే ఆలోచనలో ఉన్నారు

ములుగు అభ్యర్థి చందూలాల్‌ను మార్చాల్సిందేనని సీఎం కేసీఆర్‌ దూతల ఎదుట పదేపదే వాదిస్తున్నారు. ఎంపీ వినోద్‌కుమార్‌ ఆధ్వర్యంలో హన్మకొండలోని కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు ఇంట్లో నాలుగోసారి చర్చలు జరిగాయి. అసమ్మతి వర్గానికి నాయకత్వం వహిస్తున్న జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ సకినాల శోభన్‌, పలువురు నాయకులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. తమ వర్గంలోని పలువురు నాయకులను మంత్రి, ఆయన కొడుకు ప్రహ్లాద్‌ కేసుల పేరుతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

ములుగు నియోజకవర్గంలో తెరాస అసమ్మతి గ్రూపు వారి తరఫున ఒకరిని ఇండిపెండెంట్‌గా బరిలో నిలబెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అభ్యర్థి మార్పుకు సూచనలు కనిపించక పోవడంతో ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసమ్మతిని గదిలోకి తెచ్చేందుకు స్పీకర్‌ మధుసుదనాచారి, ఎంపీ వినోద్‌కుమార్‌, సీతారాం నాయక్‌లు పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసి బుజ్జగించే పయత్నం చేశారు. అయినప్పటికీ వినలేదు. చందూలాల్‌ను మార్చకుంటే ములుగు స్థానంలో ఓటమి తప్పదని పర్కొన్నారు. సుమారు రెండు గంటలపాటు చర్చల అనంతరం ఎంపీ వినోద్‌ సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన ఓ నేతకు ఫోన్‌ చేసి వివరాలను తెలియజేసినట్టు సమాచారం.

ఆతరువాత అసమ్మతి నేతలతో మాట్లాడిన ఎంపీ వినోద్‌ రెండు, మూడు రోజల్లో సీఎం సమయం తీసుకొని ఇప్పటి వరకు సేకరించిన సమాచారాన్ని నివేదిస్తానన్నారు.