హీరోయిన్స్ కొందరు సినిమా కల్చర్ కు అలవాటు పడితే కొందరు మాత్రం ప్రొఫెషన్ తో సంబంధం లేకుండా బయట ఎలా ఉంటారో సెట్ లో కూడా అలానే ఉంటారు . అయితే టాలీవుడ్ ఓ హీరోయిన్ మాత్రం మరీ ఈ విషయంలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది . స్టార్ సినిమాల్లో ఛాన్సులు అందుకుంటున్న ఆ హీరోయిన్ కార్ వ్యాన్ ఉన్నా లేకున్నా సరే సెట్ లోనే తమ పర్సనల్ కార్యక్రమాలు కానిస్తుందట . ప్రత్యేకమైన ఇమేజ్ ఏమి రాలేదు కాని ప్రేక్షకుల్లో ఐడెంటిటీ ఉన్న ఈ హీరోయిన్ సెట్ లోనే అందరితో క్లోజ్ గా ఉంటుందట .

అందరితో క్లోజ్ గా ఉండటం తప్పేం లేదు కాని మీద పడటం అవతల మనిషిని పూర్తిగా తన కంట్రోల్ లోకి తెచ్చుకోవడం లాంటి పనులు చేస్తుందట. ఆమె ఇవన్ని ఏం ఆశించి చేస్తుందో అర్థంకాక కొందరు సైలెంట్ గా ఆమె చేసే పనులు చూస్తూ ఉంటారట . ఇక డైరక్టర్ , ప్రొడ్యూసర్స్ తో కూడా సెట్ లో ఇకఇకలు పకపకలు చాలా కామన్ ఆమెతో సినిమా చేయాలంటే హీరోలు వెనక్కి తగ్గుతున్నారట . ఆమె చేస్తున్న సినిమాలో హీరోల కన్నా మిగిలిన వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుందట . గ్లామర్ ఇండస్ట్రీలో ఇదంతా కామన్ అని తెలిసినా తన ప్రవర్తనతో అవతల వారిని ఇబ్బంది పెడుతుంది హీరోయిన్. మరి ఈ అమ్మడి అసలు స్ట్రాటజీ ఏంటన్నది ఎవరికి అర్థం కావట్లేదు..