ఎంజీఎం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఒపీ విభాగంలో వైద్యుల లేకపోవడం పై ఆగ్రహం.

  • పలు విభాగాల్లో కి వెళ్లి హాజరు కాని వైద్యులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
  • ఎంజీఎంకు వచ్చిన పేషెంట్ల తో మాట్లాడిన మంత్రి.
  • పలు విభాగాల్లో సేవల సరిగా లేపోవడంపై సూపరింటెడెంట్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్ :

  • ఐదుగురు సీనియర్ డాక్టర్లు అందుబాటులో లేరు. చాలా బాధాకరం
  • వైద్య సేవల పరంగా చాలా పొరపాట్లు ఉన్నాయి.
  • డాక్టర్లకు మొదటి హెచ్చరికగా చెబుతున్నాం. మరోసారి ఇలా జరిగితే కటినంగా వ్యవహరిస్తాం.
  • వాళ్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టరు సూచించాను. వారు దీనిపై నిర్ణయిస్తారు.
  • మీ డ్యూటీ సమర్థవతంగా చేయాలని వైద్యులను కోరుతున్నాను.
  • దాతలు, ప్రైవేటు వైద్యుల సహాయంతో ఎంజీఎం లో ఫర్నిచర్, ఇతర వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
  • ఎంజీఎం ను పేదల పెన్నిధిగా మార్చేందుకు సీఎం కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారు. ఎంజీఎం అభివృద్ధి కి అవసరమైన నిధులు ఉన్నాయి.