కాకతీయుల కాలం నాటి శివాలయాలను పలు గ్రామాల్లో చూస్తుంటాం. కానీ వారు పరిపాలించిన కాలంలో మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలంలోని ఇనుగుర్తి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పవచ్చు. రాతిస్తంభాలపై చెక్కిన శిల్పాలు, నంది విగ్రహం, నాగేంద్రుడి విగ్రహం, ఎత్తైన యాదవరాజుల విగ్రహాలు, శాసనాలు ఇక్కడ కనిపిస్తాయి. కాకతీయుల ఆనవాళ్లు కాలగర్భంలో కలిసి పోకుండా గ్రామస్తులు స్వచ్ఛందంగా కృషి చేస్తున్నారు. ప్రభుత్వం గుర్తిస్తే కాకతీయుల నాటి ఆనవాళ్లు మరిన్ని వెలుగుచూసే అవకాశం ఉన్నందున, ఆ దిశగా ప్రయత్నించాలని గ్రామస్తులు కోరుతున్నారు.