ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కొండా మురళి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. శనివారం ఆయన శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. కొండామురళితో పాటు ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ ఉన్నారు. వరంగల్‌ స్థానిక సంస్థల ద్వారా కొండా మురళి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ తరఫున పరకాల నుంచి పోటీచేసిన కొండా సురేఖ పరాజయం పాలయ్యారు. ఫిరాయింపు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ పార్టీ.. శాసనమండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కొండా మురళి తన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. 

“పదవులు కాదు – ఆత్మగౌరవమే ముఖ్యం’’

పదవులు పట్టుకుని వేలాడటం తమ లక్షణం కాదన్నారు. నమ్ముకున్న నేత కోసం కొండా సురేఖ మంత్రి పదవిని సైతం వదులుకున్న విషయం ప్రజలకు తెలుసన్నారు.