ఏసీ గ్యాస్ లీకై కుటుంబం మొత్తం మృతి

ఇంట్లో ఎయిర్ కండిషనర్ ఉంటే దాని పనితీరు చూడకుండా పడుకుంటే అదే శాశ్వత నిద్ర అవుతుంది. ఏసీలో వాడే ఫ్రియాన్ గ్యాస్ ను క్లోరో ఫ్లోరో కార్బన్ గా పరిగణిస్తారు. ఒక్కో దఫా గ్యాస్ సిలిండర్ నుంచి వచ్చే పైప్ లు లీకై ఏసీ ఉన్న గదిలో ఆ గ్యాస్ వ్యాపిస్తుంది. లేదంటే కాయిల్స్ హీట్ అయినా పైప్ రంధ్రం పడి గ్యాస్ లీకవుతుంది. ఇటువంటి సమయాల్లో ఏసీ వేసుకుని నిద్రపోయే వారికి ఆ విషయం తెలియదు.

అయితే ఈ గ్యాస్ అరగంట కంటే ఎక్కువసేపు పీలిస్తే మెదడుకు శరీరంలోని కణజాలానికి ఊపిరితిత్తులకు ఆక్సిజన్ నిలిచిపోతుంది. దీంతో గదిలో ఉన్నవారు తెలియకుండానే కోమాలోకి జారి ఆ తర్వాత చనిపోతారు. అటువంటి సంఘటనే ఇది.

ఎయిర్ కండిషనర్ లో గ్యాస్ లీకై చెన్నై కోయంబేడు లో ఒక కుటుంబంలోని ముగ్గురు చనిపోయారు.. మృతుల్లో భార్య భర్తలతోపాటు మూడేళ్ళ బిడ్డ కూడా ఉన్నాడు. రాత్రి కరెంట్ పోవడంతో ఏసీ ని ఇన్ వర్టర్ కు కనెక్ట్ చేసి పడుకున్నారు. మధ్యాన్నం వరకు ఇంట్లో అలికిడి లేకపోవడంతో పక్కనున్న వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తలుపులు పగలకొట్టి చూడగా ముగ్గురూ చనిపోయి ఉన్నారు. ఏసీ నుంచి గ్యాస్ లీకు కావడం వల్ల వారు చనిపోయారని తేలింది.