ఓరుగల్లు నగరానికి స్మార్ట్ లుక్ సంతరించుకోనుంది . హన్మకొండ ఆర్టీసీ బస్ స్టేషన్ ఆధునికీకరణ , ప్రభుత్వ పాఠశాలల డిజిటలైజేషన్ , వడ్డేపల్లి చెరువును మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి చేయనున్నారు . ఇందుకు సంబంధించి ‘ స్మార్ట్ సిటీ ‘ పథకం కింద పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది . చేపట్టాల్సిన పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గురువారం చర్చించారు .

స్మార్ట్ సిటీ ‘ లో భాగంగా నగరంలో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ చెప్పారు . ఈ పథకం కింద చేపట్టాల్సిన పనులపై గురువారం కలెక్టరేట్లో ఇన్చార్జి మేయర్ ఖాజా సిరాజుద్దీన్ కమిషనర్ రవి కిరణ్ , డీఈఓ నారాయణరెడ్డి , ఆర్టీసీ ఆర్ఎం కిరణ్ , లీ అసోసియేట్స్ ప్రతినిధులు , ఇంజినీర్లతో సమావేశమయ్యారు.. ఈ సందర్భంగా తొలి విడతలో రూ . 80 కోట్లతో చేపట్టే ఆర్టీసీ bus station ఆధునీకరణ పనులకు సాధ్యసాధ్యాలపై చర్చించారు . బస్ స్టేషన అభివృద్ధికి నిధుల లభ్యత తక్కువగా ఉంటుందని , కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు గ్రేటర్ warangal సౌజన్యంతో నిధుల కేటాయింపు జరిగింది అని అన్నరు , వాటిని సద్వినియోగం చేసుకోలన్నారు..

రాబోయే 30 సంవత్సరాల కాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని బస్సుల రాకపోక లకు ఇబ్బంది రాకుండా పైఅంతస్తులో షాపింగ్ సినిమా థియేటర్ , హోటళ్ల నిర్వహణకు అనువు గా డిజైన్ చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు . హన్మకొండ బస్టాండ్ డిపోలు కలిపి ఎకరాల స్థలంలో ఉన్నాయని , 5 ఎకరాల స్థలంలో ఆధునిక బస్ టెర్మినల్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు . వ్యాపార సముదాయాలతో వచ్చే ఆదాయం ఇతర బస్ స్టేషన్లలో సదుపాయాలు కల్పించేందుకు దోహదపడు తుందని చెప్పారు .

అలాగే హన్మొండ వడ్డేపల్లి చెరువును భద్రకాళి బండ్ తరహాలో మినీ ట్యాం €గా . 18కోట్లతో అభివృద్ది చేపట్టనున్నట్లు తెలిపారు . పిల్లలు , వృద్ధులు సేదదీరేందుకు అనువుగా పరిసరాలను తీర్చిదిద్దనున్నట్లు వివరించారు . ప్రస్తుతం ఉన్న చెరువు కట్టకు నష్టం వాటిల్లకుండా క్రీడా మైదానం , పార్కింగ్ ఏరియా , వాకింగ్ ట్రాక్ , వాలీబాల్ కోర్టు , కిడ్స్ పార్కు , ఓపెన్ జిమ్ , కెఫటీరియా , టాయిలెట్లు , వీధిలైట్లు , ఇతర వసతులు కల్పించాలని కలెక్టర్ సూచించారు . కట్టకు దగ్గరగా చెరువు నీటిలో ఫౌంటేన్లు ఏర్పాటు చేయాలని , ప్రవేశద్వారం వద్ద కాకతీయ తోరణాన్ని నిర్మించాలని సూచించారు . 41 ప్రభుత్వ పాఠశాలలను కార్పొ రేటర్ స్థాయికి మించి మెరుగైన విద్య అందించ డానికి రూ . 10కోట్లతో డిజిటలైజేషన్ చేస్తున్నట్లు ప్రకటించారు . విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న 26 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు , 15 ప్రాథ మిక పాఠశాలను ఎంపిక చేసినట్లు చెప్పారు . డిజిటల్ తరగతుల నిర్వహణకు వసతులు సైన్స్ ల్యాబ్లు , లైబ్రరీలను ఆధునీకరిస్తామని టెన్స్ పరీక్షల అనంతరం పనులు చేపట్టి మే చివరి నాటికి పూర్తి చేయాలని సూచించారు .

బస్టేషన్ సందర్శన అంతకు ముందు గ్రేటర్ కమిషనర్ రవి కిరణ్ , స్మార్ట్ కన్సల్టెన్సీ లీ అసోసియేట్స్ ప్రతినిధుల బృందం ఆర్టీసీ బస్స్టేషన్లు సందర్శించారు . బల్దియా ప్రధాన కార్యాలయం ఆవరణలోని పార్కు స్థలాన్ని పరిశీలించారు . పోతన నగర్లోని సెకండ్ ట్రాన్స్ఫర్ కేంద్రాన్ని తనిఖీ చేశారు పనులు త్వరితగతిన పూర్తి చేసి , స్వచ్ఛ ఆటోల ద్వారా పెద్ద వాహనాలతో డంపింగ్ యార్డుకు చెత్త తరలింపు ప్రక్రియ మొదలు పెట్టాలని ఎంహెచ్ఓ రాజారెడ్డిని కమిషనర్ ఆదేశించారు .