{"source":"other","uid":"2B42303B-2021-4A00-9841-243360D6BB92_1643302429258","origin":"gallery","is_remix":true,"used_premium_tools":false,"used_sources":"{"sources":[{"type":"ugc","id":"332771724054211"},{"id":"361966122025900","type":"premium"}],"version":1}","source_sid":"2B42303B-2021-4A00-9841-243360D6BB92_1644074874060","premium_sources":["361966122025900"],"fte_sources":["332771724054211"]}

ఓ ల్యాబ్ టెక్నీషియన్‌పై మహారాష్ట్రలోని అమరావతిలో రెండేళ్ల క్రితం ఓ కేసు నమోదైంది. అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ కరోనా పరీక్ష పేరుతో మహిళ మర్మాంగం నుంచి నమూనాను తీసుకున్నారు. మహారాష్ట్రలో కరోనా మొదటి వేవ్ సమయంలో అమరావతిలో ఒక మాల్ ఉద్యోగికి కరోనా పరీక్ష పాజిటివ్ వచ్చింది. దీని తర్వాత మాల్‌లోని ఉద్యోగులందరినీ బద్నేరాలోని ట్రామా కేర్ సెంటర్‌కు పంపారు. ఉద్యోగులందరి పరీక్షను తీసుకున్న తర్వాత దోషి అయిన ల్యాబ్ టెక్నీషియన్ అల్కేష్ దేశ్‌ముఖ్ ఒక మహిళా ఉద్యోగికి పాజిటివ్ వచ్చిందని సమాచారం అందించాడు. మరోసారి పరీక్ష చేయాలని ల్యాబ్‌కు రావాలని కోరారు దీంతో ఆమె మరోసారి అతడి ల్యాబ్‌కు వెళ్లింది. అక్కడ అతడు ఆ మహిళ మర్మాంగం నుంచి శాంపిల్ తీసుకున్నాడు. అయితే ఈ రకంగా శాంపిల్ తీసుకోవడంపై ఆ మహిళకు అనుమానం వచ్చింది.

ఈ విషయాన్ని తన కుటుంబసభ్యులకు తెలియజేసింది. దీంతో బాధితురాలి సోదరుడు జిల్లా ఆస్పత్రిని వివరణ కోరాడు. ఇలా శాంపిల్ తీసుకోరని వాళ్లు తెలిపారు. దీంతో ఆ మహిళ బద్నేరా పోలీస్ స్టేషన్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌పై ఫిర్యాదు పోలీసులకు చేసింది. 25ఏళ్ల కుర్రాడు ఆ రోజు అమ్మాయితో అలా ఉన్నట్టుండి ఓ వీడియో చూసి షాక్ వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి. ఈ వ్యవహారం గత ఏడాదిన్నరగా కోర్టులో నడుస్తోంది. తాజాగా అమరావతి సెషన్స్ కోర్టు ఈ కేసుకు సంబంధించి తీర్పు వెలువరించింది. ల్యాబ్ టెక్నీషియన్‌కు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో పాటు 10వేల రూపాయల జరిమానా కూడా విధించారు. 20 జులై 2020న నేరస్థుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఘటనను వ్యతిరేకిస్తూ రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.