మీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది ఆశీర్వదించండి

-శివనగర్ గర్జిస్తే ప్రత్యర్దుల గుండెలు జల్లుమన్నయ్..

-శివనగర్ ప్రచారంలో నన్నపునేని నరేందర్

19వ డివిజన్ శివనగర్ లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న తూర్పు టీఆర్ఎస్ అభ్యర్ది నన్నపునేని నరేందర్ ముఖ్య అతిధులుగా హాజరైన మాజిమంత్రి బస్వరాజు సారయ్య,మహిళా ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ గుండు సుదారాణి పాల్గొన్న చాంబర్ ఆఫ్ కామర్స్ అద్యక్షుడు దిడ్డి కుమారస్వామి,కార్పోరేటర్ కేడల పద్మ,మహిళా నాయకురాలు హరిరమాదేవి,డివిజన్ మహిళా అద్యక్షురాలు మోహిణీ బాయి ఘాటే,తెరాసా డివిజన్ ముఖ్య నాయకులు,ముఖ్య మహిళా నాయకురాళ్ళు,యూత్ నాయకులు,కార్యకర్తలు

మహిళలు ఇంటింటా మంగళహారతులిచ్చి నరేందర్ కు ఘన స్వాగతం పలికారు.బతుకమ్మలు,బోనాలు,డప్పు చప్పుల్లు పెద్ద ఎత్తున తరలి వచ్చిన జన సంద్రం మద్య ఈ ప్రచారం కొనసాగింది.విశేషంగా తరలివచ్చిన జన ప్రవాహం జాతరను తలపించింది.జైతెలంగాణా నినాదాలు కళాకారుల ఆటపాటతో ప్రచారం హోరెత్తింది.

నన్నపునేని నరేందర్ కామెంట్స్..

-అభివృద్దిని ప్రజలకు చేరకుండా ఎమ్మెల్యే అడ్డం పడింది.
-ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో మూడు డివిజన్ లను మోడల్ డివిజన్ గా ఏర్పాటు చేసి 30కోట్ల నిదులు కేటాయించడం జరిగింది.

-వర్షాలకు శివనగర్ మునుగుతుంటే 15కోట్ల నిదులతో కోట గడ్డనుండి వరద నీరు శివనగర్ వీదులకు రాకుండా భయటకు వెల్లే విదంగా పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది.

-ఎస్సీ ఎస్టీ నిదులను ప్రజలకు చేరకుండా అదికారులకు పిర్యాదులు చేసింది గత ఎమ్మెల్యే..

-ఎలక్షన్ కోడ్ ముగిసాక లోన్లు మీ ఖాతాలలో జమ అవుతాయి..

-మీవల్లే రాజకీయ జన్మ వచ్చింది.స్వతంత్రంగా మీకు పనిచేసే అవకాశం దొరికింది.

-జనవరిలో మీ ఇంటింటికి తిరిగి మీ సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ ఫలాలు అందిస్తా..

-ఇల్లు లేని వారికోసం సొంత జాగాలో ఇల్లు నిర్మించుకుంటే 5లక్షల రూపాయలు ఇచ్చేందుకు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు.

-పించన్లు డబుల్ కానున్నాయి.

-ఇక్కడ చిల్లరమల్లర నాయకులు తయారైల్లు.కొండా సురేఖ మురళీలు ఇక్కడ ఏం చేయలేదు.అభివృద్దికి అడ్డం పడుతున్నారని ముఖ్యమంత్రి గారు వారికి టికెట్ ఇవ్వలేదు.

-కొండా మురళి సురేఖ నాకు అండ దండా అని ఖమ్మం అతను అంటున్నాడు.అసలు వాళ్ళకే దిక్కులేక పరకాల పోయారు నీకు దిక్కు ఎక్కడిది..

-ఒకరు ఖమ్మం,ఒకరు జఫర్ ఘడ్ నేను పక్కా లోకల్..

-అండర్ బ్రిడ్జ్ దగ్గర నా ఇళ్ళు అర్దరాత్రి ఆపదచ్చినా అందుబాటులో ఉంటా

-మీ బిడ్డగా మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు దక్కింది..నన్ను ఆశీర్వదించండి..