ఆశ్రమం లో ఆకులు లక్ష్మీ అనే వృద్ధురాలు కాలం చేసింది. కొడుకు కోడలు తన కళ్ళ ముందే చనిపోవడం తో ఆకుల లక్ష్మి జీవితంలో తట్టుకోలేని బాధ కి గురి అయింది ఇక తనకు మిగిలింది ఒక మనుమరాలు ఆ మనమరాలిని చూసుకుంటూ కాలం గడిపింది రెండు సంవత్సరాల క్రితం లక్ష్మీ ఆరోగ్యం క్షీణించి తన పని తాను చేసుకోలేని పరిస్థితి మనుమరాలి చదువు కి ఆటంకం రావటం ఇదంతా గమనించిన జూకల్ గ్రామానికి చెందిన MPTC ఆకుల లక్ష్మీ మరియు మనఉమారాలి పరిస్థితి మన ఆశ్రమానికి తెలియచేసి ఎలాగయినా వారిద్దరిని కాపాడాలని చెప్పడంతో వెంటనే ఆకుల లక్ష్మీ ని ఆశ్రమం లో చేర్చుకొని మనుమరాలు రవళి కి అన్ని విధాలుగా ధైర్యం చెప్పి చదువు కోసం హాస్టల్లో చేర్పించటం జరిగింది, కానీ వృద్ధురాలయిన లక్ష్మీ కి మనం ఎంత ధైర్యం చెప్పినా కొడుకు కోడల్ని గుర్తు చేసుకుంటూ మనుమరాలి జీవితం ఏమవుతుందో అనే బెంగ తో ఆ వృద్ధురాలు ఇంకా అనారోగ్యానికి దగ్గరుడ్డి కాలం చేసింది ఆకుల లక్ష్మీ కి ప్రాణమయిన తన మనమరాలితో అంత్యక్రియలు చేపించటం జరిగింది.