రెండేళ్ల క్రితం ఓ అపరిచితుడు నన్ను భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. భోజనం కోసం నేను ఇంటి నుంచి బల్లూ అడ్డా మురికివాడకు వచ్చాను. అక్కడ నాతో పాటు మరో ఇద్దరు బాలికలను విజయ బాద్రి అనే దాదా తీసుకువెళ్లి చికెన్‌తో భోజనం పెట్టాడు. అనంతరం కొత్త బట్టలతో పాటు కొంత డబ్బులిచ్చాడు నేను పేదరికం నుంచి వచ్చినందున వాటిని ఎలా కాదనగలను పదిహేనేళ్ల వయసులో ఇలా సాయం చేస్తే దాదాను మంచివాడనుకున్నాను. కాని మరునాడు తెలిసింది నాకు మత్తు మందు కలిపిన భోజనం పెట్టి, మత్తులోకి జారుకున్నాక దాదా నాపై అత్యాచారం చేశాడు. అనంతరం విటుల వద్ద డబ్బు తీసుకొని నన్ను వారితో పంపించేవాడు. అలా నన్ను వ్యభిచారం వృత్తిలోకి దించాడు’’ అని ఓ బాధిత బాలిక వెల్లడించారు. ఈ వ్యభిచార గృహం నుంచి పారిపోయేందుకు పలు సార్లు ప్రయత్నించానని, కాని దాదా గూండాలు తనను పట్టుకొని కొట్టారని బాధిత బాలిక రోదిస్తూ చెప్పారు. రైల్వే పోలీసుల జోక్యంతో వ్యభిచార కూపం నుంచి బయటపడిన బాలిక తాను వ్యభిచార గృహంలో పడిన పాట్లను కన్నీళ్లతో చెప్పారు….