వరంగల్ హన్మకొండలో 9 నెలల చిన్నారి హత్యను నిరసిస్తూ హైదరాబాద్ లో బాధిత కుంటుంబం ర్యాలీ చేస్తోంది. ఎర్రమంజిల్ నుంచి సెక్రటేరియట్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీంతో ఎర్రమంజిల్ వద్ద ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించి వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారి మేనమామ భరత్ మాట్లాడుతూ చిన్నారిని హత్య చేసిన నిందితుడు ప్రవీణ్ ను వెంటనే ఉరి తీయాలని అన్నారు. తమకు గుర్తు తేలియని వ్యక్తులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, ర్యాలీలో పాల్గొంటే క్రిమినల్ కేసులు పెడుతామంటున్నారని ఆయన తెలిపారు.

ఇంతటి దారుణానికి పాల్పడ్డ నిందితున్ని మాత్రం శిక్షించకుండా జైల్ లో పోషిస్తున్నారని భరత్ అన్నారు. రాష్ట్రంలో ఇలాంటి అఘాయిత్యాలు జరుగకుండా ఓ చట్టాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. ర్యాలీలో మహిళలు, యూత్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిందితుడ్ని వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.