జకర్తా: జీవిత భాగస్వామితో తప్ప వివాహేతర శృంగారంపై ఇండోనేసియా నిషేధం విధించింది. ఈ తీర్మానాన్ని ఇండోనేసియా పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ నిబంధన ఇండోనేసియా ప్రజలతోపాటు ఆ దేశంలో నివసించే విదేశీయులకు వర్తిస్తుంది. అదేవిధంగా గర్భనిరోధాన్ని ప్రోత్సహించడం, ప్రభుత్వ సంస్థలను, అధ్యక్షుడిని అవమానించడాన్ని కూడా ఇండోనేసియా పార్లమెంటు నిషేధం విధించింది. ఈ మేరకు ఇండోనేసియా పీనల్ కోడ్ సవరణ తీర్మానానికి చట్టసభ్యుల ఏకగ్రీవ ఆమోదం లభించింది. సవరించిన నేర శిక్షాస్మృతి ప్రకారం ఇప్పటికే ఉన్న దైవదూషణ చట్టం మరింత విస్తృతమైంది. ఇండోనేసియా ప్రభుత్వం గుర్తించిన ఆరు మతాలు ఇస్లాం,ప్రొటెస్టాటిజం, క్యాథలిక్, హిందు, బుద్ధిజం, కన్ఫూషియాజాలను కించపరిచేవారికి జైలు శిక్ష విధించనున్నారు. మార్కిస్ట్ లెనినిస్ట్ భావజాలంతో సంబంధం ఉన్నవారికి జైలు, కమ్యూనిజం వ్యాప్తి చేసేవారికి సంవత్సరాల శిక్ష విధించనున్నారు.

అయితే కొత్త కోడ్ ప్రకారం అమలు చేయడానికి పాటించనున్నారు. మరణదండన విధించిన వ్యక్తి పది సంవత్సరాలలోపు సక్రమంగా ప్రవర్తిస్తే మరణశిక్షను జీవితకాలపు శిక్ష లేదా 20ఏళ్ల జైలుశిక్షగా శిక్షాస్మతిని సవరించారు. ఇండోనేసియా నియమ, నిబంధనల ప్రకారం ఆ దేశ పార్లమెంటు ఆమోదించిన తీర్మానం చట్టంగా మారాలంటే అధ్యక్షుడు ఆమోదిస్తూ సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే ఆ నిబంధనను రద్దు చేయాలని అధ్యక్షుడు కోరితే తప్ప 30 రోజుల అనంతరం అధ్యక్షుడు సంతకం చేయకపోయినా పార్లమెంటు ఆమోదించిన తీర్మానం అమలులోకి వస్తుంది. పార్లమెంటు ఆమోదించిన శిక్షాస్మృతి సవరణను ఆమోదిస్తూ అధ్యక్షుడు జోకో విడోడో సంతకం చేస్తారని ఆ దేశ నేతలు అంచనా వేస్తున్నారు. నిబంధనల ప్రకారం సవరణలు అమలు చేసేందుకు కార్యాచరణ పాటించాలి ఉంటుంది ఈక్రమంలో ఒక్క ఏడాది కాలంలో సవరణలన్నీ అమలు చేయడం సాధ్యంకాదని స్పష్టం చేశారు. కాగా సవరించిన కోడ్ ప్రకారం వివాహేతర శృంగారానికి పాల్పడినవారికి జైలు శిక్ష విధించనున్నారు. అయితే వ్యభిచార ఆరోపణలపై పోలీసులు నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. కొత్త కోడ్‌తో బాలి, మెట్రోపాలిటన్ జకార్తా వంటి పర్యాటక ప్రాంతాలతోసహా అనేక హోటళ్లుపై ప్రభావం చూపనుంది.