{"source":"other","uid":"2B42303B-2021-4A00-9841-243360D6BB92_1643302429258","origin":"gallery","is_remix":true,"used_premium_tools":false,"used_sources":"{"sources":[{"id":"332771724054211","type":"ugc"},{"id":"361966122025900","type":"premium"}],"version":1}","source_sid":"2B42303B-2021-4A00-9841-243360D6BB92_1644074874060","premium_sources":["361966122025900"],"fte_sources":["332771724054211"]}

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని వన్ డ్రైవ్ ఇన్ హోటల్‌ బాత్రూములో రహస్య కెమెరాతో ఫొటోలు, వీడియోలు తీస్తున్న ఘటన వెలుగులోకి వచ్చి కలకలం రేపింది. బాత్రూమ్ కు వెళ్లిన యువతి అక్కడ ఓ సీక్రెట్ కెమెరా ఉండటం గురించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బుధవారం జూబ్లీహిల్స్‌లోని వన్‌డ్రైవ్ ఫుడ్‌కోర్టులో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే హోటల్‌కు చేరుకుని బాత్రూమును తనిఖీ చేశారు. అప్పటికీ అది ఆన్‌లోనే ఉన్నట్టు గుర్తించారు. అనంతరం పోలీసులు రెస్టారెంట్ యజమాని చైతన్యతో పాటు మరో ఇద్దరు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.వారిని విచారించగా తమకేమీ ఈ విషయం తెలియదని చెప్పారు. దీంతో వారికి తెలియకుండా బాత్రూమ్ లో కెమెరా ఎవరు పెట్టారు? ఎన్ని రోజుల నుంచి అది ఉంది?

గతంలో ఆ కెమెరాలో రికార్డు అయిన ఘటనలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంట్లో భాగంగా దర్యాప్తు కొనసాగించిన పోలీసులు బాత్రూమ్ క్లీనర్ బెనర్జీ ఈ కెమెరాను అమర్చినట్టు గుర్తించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా రెస్టారెంట్ కు వచ్చిన యువతులు, మహిళలు బాత్రూమ్ అవసరమైతే వెళుతుంటారు. అటువంటివారిని కెమెరాతో షూట్ చేసి అనంతరం వారిని బ్లాక్ మెయిల్ చేయటానికి ఇలా కెమెరా ఏర్పాటు చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కెమెరాలో ఫీడ్ అయిన డేటాతో గతంలో ఎవరినన్నా బ్లాక్ మెయిట్ చేశాడా?అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు.