గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్, బీజేపీ లకు జరిమానా విధించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనుమతి లేకుండా ప్రధాన కూడళ్లలో రెండు పార్టీలు పోటాపోటీగా భారీ స్థాయిలో ప్లెక్సీలు ఏర్పాటు చేశాయి. దీంతో GHMC బీజేపీకి 20 లక్షలు, టీఆర్ఎస్ కు 3 లక్షలు జరిమానా వేసింది. జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం బీజేపీ ప్లెక్సీలు ఏర్పాటు చేయగా వారికి పోటీగా ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఇలా బహిరంగంగా ప్లెక్సీలు ఏర్పాటు చేసిన ప్రతీసారీ సెలవులలో ఉండే GHMC ఎండీ ఈ సారీ కూడా ఏదో సాకుతో సెలవులపై వెళ్లారు. కానీ ఇరు పార్టీలకు జరిమానా విధించారు. అయితే GHMC వేసిన ఫైన్‌లను ఇరుపార్టీలు కడతాయా లేదా.?అనేది చూడాలి మరి…