డీజిల్ షెడ్ కార్మికుల రీక్రియేషన్స్ క్లబ్ ఎన్నికల్లో మజూర్ యూనియన్ ప్యానల్ విజయం సాధించింది . శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి . మొత్తం 542 ఓట్లకుగాను 499 ఓట్లు పోలయ్యాయి . ఎన్నికల అధికారి నర్సింహా అసిస్టెంట్ పర్సనల్ అధికారి , (సికింద్రాబాద్ ) సమక్షంలో రాత్రి కౌంటింగ్ ప్రారంభమైంది . ఉత్కంట భరితంగా సాగిన పది రౌండ్ల కౌంటింగ్లో మజూర్ యూనియన్ ప్యానల్ (జెండా గుర్తు ) విజయం సాధించింది . సంఘ్ బలపర్చి ప్యానల్ నుంచి ఒక్కరు కూడా విజయం సాధించలేదు . ఫలితాల అనంతరం విజయం సాధించిన ఎం . శ్రీనివాస్ రావు ప్యానల్ ను యూనియన్ జోనల్ ప్రెసిడెంట్ కాల్వ శ్రీనివాస్ , డివిజన్ ఆధ్యక్ష , కార్యదర్శులు కె . యాదవరెడ్డి , పి . రవీందర్ ఇతర నాయకులు అభినందించారు . అనంతరం బాణాసంచా పేల్చి ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు విజయం సాధించింది వీరే … సెక్రటరీగా ఎం . శ్రీనివాస్ రావు ( పోలైన ఓట్లు – 186 ) , జాయింట్ సెక్రటరీ రమేశ్ ట్రెజరర్ జి . శంకర్ ( 181 ) , కమిటీ మెంబర్లు కేజే సాల్మన్ రాజు ( 300 ) ఆర్ సదానందం ( 308 ) , భాస్కర్ రెడ్డి ( 278 ) , సచిన్ కుమార్ ( 229 ) , ఎస్ . నర్సయ్య ( 284 ) , ఎస్ శ్రీనివాస్ ( 223 ) విజయం సాధించారు .

అత్యధిక 308 ఓట్లు

వీరిలో అత్యధిక 308 ఓట్లు పోలైన రాముల సదానందం ఆకర్షణగా నిలిచారు … అందరి సహకారంతో ఈ ఘన విజయం సాదించ గలిగాను అని సదానందం తెలిపారు ..