• నాన్ క్యాడర్ ఎస్పీగా పదోన్నతి.
  • ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడెం స్వగ్రామం.
  • హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలు.

ఖమ్మం జిల్లాకు మరో ఘనత దక్కింది తెలంగాణ రాష్ట్రంలోనే తొలి మహిళా ముస్లిం ఐపీఎస్‌ ను అందించిన కీర్తి జిల్లా సొంతం చేసుకుంది. అంతే కాదు, ఖమ్మం జిల్లా నుంచి కూడా తొలి మహిళా ఐపీఎస్‌ అధికారిని ప్రజా సేవకు పంపిన మరో ఘనత కూడా ఈ జిల్లాకే దక్కడం విశేషం. వివరాల్లోకి వెళ్తే: కేంద్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసిన నాన్ క్యాడర్ ఐపీఎస్‌ పదోన్నతి జాబితాలో ఖమ్మానికి చెందిన షేక్ సలీమా ఐపీఎస్‌ గా పదోన్నతి పొందారు. ఈమె స్వగ్రామం చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామం. లాల్ బహదూర్, యాకూబ్ బీ దంపతుల మొదటి సంతానమే సలీమా.

తండ్రి ఖమ్మంలో ఎస్ఐగా పని చేసి రిటైరయ్యారు. ఆమె విద్యాభ్యాసం అంతా ఖమ్మంలోనే సాగింది. ప్రాథమిక పాఠశాల పబ్లిక్ స్కూల్లో హై స్కూల్ సెంచరీ లో చదివారు. ఇంటర్మీడియట్ ప్రతిభ కాలేజీలో, డిగ్రీ న్యూ జనరేషన్ కళాశాలలో పూర్తి చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ బయో టెక్నాలజీ లో పీజీ చేశారు.