తెలంగాణలో ప్రస్తుతం లాక్ డౌన్ అవసరం లేదని, వైద్యశాఖ అధికారులు కూడా అదే నివేదిక అందించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఒమిక్రాన్ పట్ల భయం అవసరం లేదని, అదే సమయంలో అజాగ్రత్త పనికిరాదన్నారు. ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు సమకూర్చుకోవాలని, ఆక్సిజన్ బెడ్స్, మందులు ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు.

ఒమిక్రాన్ పట్ల భయం అవసరం లేదన్నారు, అందరూ కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కు తప్పనిసరిగా ధరించాలని సీఎం సూచించారు. 35 లక్షలు ఉన్న టెస్టింగ్ కిట్లను 2 కోట్లకు పెంచాలని, ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేయాలని సూచించారు. మున్సిపాలిటీల్లో హైదరాబాద్ తరహాలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.