వరంగల్ క్రైం : మహాశివ రాత్రి వర్వదినం సందర్భంగా నగరంలో ట్రాఫికను మళ్లించినట్లు వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ ఎండీ మజీద్ తెలిపారు . శివ రాత్రి సందర్భంగా హన్మకొండ వేయిస్తంభాల దేవాయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు ఆయన చెప్పారు . సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ట్రాఫిక్ మళ్లింపు నిబంధనలు అమలులో ఉంటుందన్నారు . ములుగు పరకాల వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు పెద్దమ్మగడ్డ , కేయూసీ జంక్షన్ , సీపీఓ కార్యాలయం మీదుగా బస్టాండ్ చేరుతాయి .

  • బస్టాండ్ నుంచి ములుగు , కరీంనగర్ వైపు వెళ్లే బస్సులు ఏషియాన్ శ్రీదేవి మాల్ నుంచి అంబేడ్కర్ జంక్షన్ మీదుగా వెళతాయి .
  • హన్మకొండ బస్టాండ్ నుంచి నర్సంపేట , తొర్రూరు , భద్రాచలం వైపు వెళ్లే బస్సులు బాలసముద్రం , హంటర్రోడ్డు నుంచి వెళతాయి.
  • వరంగల్ బస్టాండ్ నుంచి హన్మకొండకు వచ్చే బస్సులు చింతల్ బ్రిడ్జి , రంగసాయి పేట , నాయుడు పెట్రోల్ పంపు , ఉర్పుగుట్ట , బాలసముద్రం మీదుగా బస్టాండకు చేరు కోవాలి . ములుగు రోడ్డు నుంచి హన్మకొండకు వెళ్లే ద్విచక్ర వాహనాలు , ఆటోలు కాపవాడ నుంచి బస్టాండు చేరుకుంటాయి .
  • హన్మకొండ నుంచి వరంగల్ కు వెళ్లే కార్లు , ఆటోలు మర్కజీ రోడ్డు నుంచి పెద్దమ్మగడ్డ మీదుగా వరంగల్ చేరుకుంటాయి . వాహన దారులు , భక్తులు నిబంధనలను పాటించాలని ఏసీపీ మజీద్ కోరారు .