రుణాలు ఇప్పిస్తామంటూ ఆన్ లైన్ లో ప్రచారాలు నమ్మొద్దు! నమ్మరా ..? ఇలాంటి వగలాడి లేడీస్ ముంచేస్తారు ఆన్ లైన్లో ఫర్నిచర్ కు రుణాలు ఇస్తామంటూ చెన్నై సాలిగ్రామం కేకే గార్డన్‌కి చెందిన మీనా (35), శంకర్‌ (30) ప్రకటనలు ఇస్తుంటారు. ఆ మాటలు నమ్మి వాళ్లకు ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, పాస్‌పోర్టు జిరాక్స్, ఫొటో వంటి సర్టిఫికెట్లు ఇచ్చేశారు. ఋణం సంగతి ఎలా ఉన్నా నెల తరువాత మీరు తీసుకున్న రుణానికి వాయిదాలు కట్టాలని బ్యాంకు నోటీసులు వచ్చాయి.. విచారిస్తే వీళ్ళిద్దరూ ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, పాస్‌పోర్టు జిరాక్స్, ఫొటో వంటి సర్టిఫికెట్లు తమ వద్ద ఇచ్చిన వాళ్ళ పేర్లమీద లక్షల్లో రుణాలు తీసుకొని బిచాణా ఎత్తేసారు.. పోలీసులు కేసు నమోదు చేసి మీనా, శంకర్‌ని అరెస్ట్‌చేశారు