యాంకర్ విష్ణు ప్రియను కొందరు టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. యాంకర్ విష్ణు సోషల్ మీడియాలో ఎంతగా చెలరేగుతోందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో విష్ణుప్రియ చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఆమె చేసే అందాల ప్రదర్శనకు అందరూ నోరెళ్లబెడుతుంటారు. ఓ వైపు దైవచింతనలో ఉన్నానని చెబుతూ, మరో వైపు అందాల ఆరబోత చేస్తుంటుంది. కాగా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ పై కొందరు నెటిజన్స్ అసభ్య పదాజాలంతో త్డుతుంటారు. మరి చిట్టి పొట్టీ బట్టలు వేసుకుంటూ చూయించనవి కూడా చూయిస్తూ ఉంది అంటూ ఆమె ఫోటో క్రింద కామెంట్స్ పెడుతుంటారు. ఇక కొన్ని సార్లు విష్ణు ప్రియ అలాంటి వాళ్ల మీద ఫైర్ అయిన సంధర్భాలు ఉన్నాయి. కానీ మళ్లీ వాళ్ల ట్రోలింగ్ వాళ్లు చేసుకుంటారు.

కాగా విష్ణు ఆ మధ్య ఓ సారి షర్ట్ బటన్స్ అన్ని విప్పి లోదుస్తులతో ఫోటో లకు ఫోజులు ఇస్తూ కుర్రకారులకు సెగలు పుట్టించింది. దీంతో అమ్మడు పై పలువురు మండిపడారు. టీవీ షోలలో అవకాశాలు రాకపోయేసరికి ఇలా భరితెగించావా అంటూ విష్ణు చేసిన క్లీవేజ్ షో పై తీవ్రంగా మండిపడ్డారు. ఇక ఓ మూవీ ప్రెస్ మీట్ లో విష్ణు ప్రియ సంచలన కామెంట్స్ చేసింది. ఎక్స్ పోజింగ్ గురించి విలేఖరు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ”నా బాడీ నా ఇష్టం, మీరెవరు నన్ను అడగడానికి” అని రిపోర్టర్ కి దిమ్మదిరిగే సమాధానం చెప్పింది. దీంతో యాంకర్ విష్ణు ప్రియ బిహేవియర్ ను కొందరు తీవ్రంగా తప్పుపట్టారు.