నేటి నుంచి 23వరకు నాలుగు రోజులపాటు జరిగే నవ్ముక్క – సారక్కల మినీ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు . 23నాడు అమ్మవార్ల పూజారులు సమ్మక్క – సారక్కల పూజామందిరంలో నిర్వహించే “మండమెలిగే” పండుగతో మినీ జాతర ప్రారంభం అవుతుంది .దీంట్లో భాగంగా అమ్మవార్లను దర్శించుకునేందుకు సుమారు 10నుంచి 15లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాలతో అధికారులు సౌకర్యాలను ఏర్పాటు చేశారు .

అమ్మవార్ల దర్శనంలో భక్తులు ఇబ్బందులకు గురికాకుండా దేవదాయశాఖ అధికారులు క్యూలైను సరిచేయడంతో పాటు అమ్మవార్ల గద్దెల ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు . భక్తుల రద్దీని బట్టి భక్తులకు సులువుగా దర్శనం కలిగేలా ఏర్పాటు చేశారు క్యూలైన్లలో తాగునీటిని అందించేందుకు ఎండ నుంచి రక్షణ కల్పించేందుకు గద్దెలపై చలువ పందిళ్లను ఏర్పాట్లు చేశారు . వీఐపీల కోసం ప్రత్యేకంగా దర్శనం చేయించేందుకు గాను ఇద్దరు సిబ్బందిని నియమించారు . RWS వారు భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్లు , తాగునీటి స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పాటు, ట్యాంకర్లతో జాతర పరిసరాలలో విడిది చేసే భక్తులకు తాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేశారు . దుస్తులు మార్చుకునేందు చాటు గదులను ఏర్పుటు చేసారు ..