వరంగల్ ఉమ్మడి జిల్లాలో, గతంలో కాంగ్రెస్ కి ఎంతో ఘణ చరిత్ర ఉండేది . వరంగల్ జిల్లాలోనే సంచలన నేత అయిన కొండా దంపతులు పరకాల నుండి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు, అనంతరం ఆమె దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా కొనసాగి అనంతర పరిణామాలతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి YSR కాంగ్రెస్ లో చేరారు . అప్పటి నుండి పరకాల కాంగ్రెస్ కు నేత కరువయ్యారు . అనంతరం పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యరిగా ఇనుగాల వెంకట్రామిరెడ్డి 2014 ఎన్నికల్లో బరిలో నిలిచి ఓటమి అనంతరం నియోజకవర్గ ఇంచార్జీగా కొనసాగుతూ 5 సంవత్సరాల పాటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను కాపాడుకుంటూ అప్పటి నుండి జరిగిన స్థానిక ఎన్నికల్లో కొందరు ద్వితీయశ్రేణి నేతలను ప్రజాప్రతినిధులుగా గెలుపించుకొని పలు కార్యక్రమాలను విజయవంతం చేశారు . అయితే 2018 ఎన్ని కల్లో ప్రజాకూటమిగా ఏర్పడి ప్రతిపక్షాలు బరిలో నిలిచాయి . ఈ క్రమంలో ఇనుగాలను కాదని కాంగ్రెస్ పార్టీలో చేరిన కొండా సురేఖను కాంగ్రెస్ అభ్యర్థిగా పరకాల నుండి బరిలో నిలిపారు . ఎన్నికల్లో ఆమె ఓటమిపాలు కావడంతో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని, పరకాల కాంగ్రెస్ సారధి ఎవరో తెలియక కార్యకర్తల్లో అంతర్మధనం మొదలైంది .

పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ పరకాల నియోజకవర్గానికి కాంగ్రెస్ ఆగ్రనేత ఎవ్వరో అర్ధంకావడంలేదని అంటున్నారు , ఈ పరీస్థితి ఇలా ఉండగానే ఇటీవల సర్పంచ్ , వార్డు మెంబర్లకు జరిగిన ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుండి పదుల సంఖ్యలో కాంగ్రెస్ సర్పంచ్లు గెలుపొందారు . ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు అధికార టీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నుండి మొదలుకొని ఇతర మండల జిల్లా స్థాయి నేతలు సహకారం ,టీఆర్ఎస్ పార్టీ నుండి బరిలో నిలిచిన సర్పంచ్ వార్డు మెంబర్ కోసం గ్రామాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించినప్పటికి, కాంగ్రెస్ పార్టీ నుండి ఏ నాయకుడు కూడా తమవైపు కన్నెత్తి చూడలేదనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . అయితే పరకాల నియోజకవర్గంలో ఆత్మకూర్, పరకాల, మండలాల నుండి కొందరు కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరగా.

మిగతా ద్వీతీయశ్రేణి నేతలు ఇప్పటికి గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికి సరైన దిశా మార్గం చూపించే నేత లేపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు , అయితే పరకాల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ ఇనుగాల వెంకట్రామిరెడ్డి ? లేక పరకాల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందిన కొండా సురేఖనా ? అనే చర్చ కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తుంది . ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్డులుగా పోటీచేసి ఓటమి చెందిన ఒక నాయకుడు తన ఆవేదనను వెల్లిబుచ్చారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుండి ఎలాంటి సహకారం లేకున్నా నియోజకవర్గ వ్యాప్తంగా 20 నుండి 30 మంది సర్పంచ్లుగా గెలుపొందారని అదే పార్టీ అగ్రనాయకులు సహకరిస్తే మరిన్ని స్తనాలు కాంగ్రెస్ పార్టీకి లభించేవని తెలిపారు.

ప్రతిపక్ష పార్టీల నుండి స్థానిక సంస్కల ఎన్నికల్లో బరిలో నిలువగా తమకు అనేక ఒత్తిడిలు వచ్చాయని, అయినప్పటికి ప్రజల సహకారంతో వాటిని అధిగమించినట్లు తెలిపారు . ఇప్పటికైన పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ‘ఇప్పటికి’ బలంగా ఉందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు , ఇప్పటికైన పరకాల పై దృష్టి సారించి సరైన చర్యలు తీసుకోవాలని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతున్నారు .