{"source":"other","uid":"2B42303B-2021-4A00-9841-243360D6BB92_1641706410856","origin":"gallery","is_remix":false,"used_premium_tools":false,"used_sources":"{"sources":[{"id":"361966122025900","type":"premium"}],"version":1}","premium_sources":["361966122025900"],"fte_sources":[]}

ఛత్రా జిల్లా పాతాల్‌గడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుంద్రా గ్రామానికి చెందిన రాణి కుమారి అనే యువతి, ఛత్రా నగరానికి చెందిన తన బావ ప్రశాంత్ అగర్వాల్‌ను పెళ్లి చేసుకుంది. ప్రశాంత్ అగర్వాల్ తండ్రి నిర్మల్ అగర్వాల్ స్థానికంగా పేరు మోసిన వ్యాపారస్తుడు. సిటీలోని కేసరి చౌక్ గౌరక్షని రోడ్‌లో సొంత ఇల్లు ఉంది. రాణి కుమారికి, ప్రశాంత్‌కు ఒక బాబు పుట్టాడు. ప్రస్తుతం ఆమె మళ్లీ గర్భంతో ఉంది. అయితే ఆమె అత్తమామలు ఇక పిల్లలు వద్దని, అబార్షన్ చేయించుకోవాలని ఆమెపై ఒత్తిడి చేశారు, భర్త కూడా వాళ్లకే వంత పాడాడు. కాని అబార్షన్ చేయించుకునేందుకు రాణి కుమారి సిద్ధంగా లేదు. అబార్షన్ చేయించుకోమని ఆమె ఎంత చెప్పినా వినడం లేదని ఆమెపై కక్ష పెంచుకున్న ఆ కుటుంబం ఆమెను చంపేయాలని నిర్ణయించుకుంది. ఇందుకు ఆ కుటుంబానికి సన్నిహితులైన భార్యాభర్తలైన ఇద్దరు డాక్టర్లు కూడా సహాయం చేశారు.

అందరూ కలిసి ఇంట్లోనే ఆమెను చంపేసి శవాన్ని మాయం చేశారు. రాణి కుమారిని హత్య చేసిన అనంతరం ఇంటికి తాళం వేసి ఇల్లు వదిలి వెళ్లిపోయారు. బాధితురాలి కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు కేసు విచారణ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి హత్య జరిగిన ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఆ ఇల్లు బయట లాక్ చేసి ఉండటంతో బద్ధలు కొట్టి లోపలకు వెళ్లి చూశారు. లోపల రాణి కుమారి మృతదేహం కనిపించలేదు. ఈ ఘటన జరిగి 24 గంటలవుతున్నా నిందితుల జాడను, బాధితురాలి మృతదేహాన్ని పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఈ ఘటనకు సంబంధించిన మిస్టరీని త్వరలోనే ఛేదిస్తామని పోలీసులు చెప్పారు. అబార్షన్ చేయించుకోకపోతే ఒక నిండు ప్రాణం తీసే స్థాయికి దిగజారిపోయిన మనుషులు ఈ సమాజంలో ఉన్నారంటే నిజంగా శోచనీయం.