పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదు

మెదక్ జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెలరోజుల పాటు (నవంబర్ 1వ తేది నుండి 30వ తేదీ వరకు) జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని మెదక్ జిల్లా ఎస్.పి. కుమారి చందన దీప్తి ఐ.పి.ఎస్ గారు తెలిపారు. ఈ ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదు. అలాగే ప్రభుత్వ ఆస్తులకు, ప్రజాధనానికి నష్టం కలిగించే చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్.పి. చందనదీప్తి గారు హెచ్చరించారు.

కాబట్టి జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు , వివిధ సంఘాల నాయకులు పోలీసులకు ఈ విషయంలో సహకరించాల్సి ఉంటుందని చెప్పారు..