వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ మటనల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులకు అప్పగించడానికి నిర్ణయించినట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న 314 వాహనాలను మడికొండ పోలీస్ శిక్షణా కేంద్రంలో భద్రపర్చడం జరిగింది. వాటిని పోలీస్ స్టేషన్ల వారిగా గుర్తించి సంబంధిత వాహన యజమానులకు నోటీసులు పంపించబడ్డాయి.

తగిన ఆధారాలతో వచ్చిన వారికి వాహన యజమానులకు వాహనాలను అందజేయబడుతుంది. మరింత సమాచారం కోరకు సిసిఆర్‌బి ఏసిపి సెల్ నంబర్ 9491089116 లేదా సిసిఆర్ బి ఎస్.ఐ సెల్ 7901138335 నంబర్లకు వాహన యజమానులు సంప్రదించగలరని పోలీస్ కమిషనర్ ఓ ప్రకటనలో తెలియజేసారు.