• అధినేత ప్రసన్నం కోసం జోరుగా యత్నాలు
• బరిలో ప్రముఖ కార్పోరేటర్లు
• మహిళకే కేటాయించే అవకాశం . . !

వరంగల్ సీఎం దృష్టిలో పడేందుకు తమ వంతు యత్నాలను ముమ్మరం చేసిన దశలో, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయమే ఫైనల్ అని భావిస్తున్నారు . గ్రేటర్ వరంగల్ మున్సిపల్ మేయర్ నరేందర్ , వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో మేయర్ పోస్టు ఖాళీ అయింది . డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్ కు ఇప్పటి వరకు అధికారికంగా బాధ్యతలను కట్టబెట్టారు . మైనార్టీ కోటాలో మేయర్ గా సిరాజుద్దీన్సే కొనసాగించాలని టిఆర్ఎస్ లోని ఓ వర్గం పట్టుబడుతోంది . కానీ మహిళ మేయర్ పీఠాన్ని అధిష్టించేందుకు పావులు కదుపుతున్నారు . ఈ దశలోనే తాజాగా మేయర్ ఎన్నిక షెడ్యూల్ వెలువడింది . ఈనెల 23న నోటిఫికేషన్ జారీ అయ్యాక అధికారిక ఎన్నికల ప్రక్రియ షురూ అవుతుంది . 27వ తేదీన గ్రేటర్ లో నిర్వహించే ప్రత్యేక సమావేశంలో మేయర్ ఎన్నిక లాంఛనమవుతుంది . మెజార్టీ కార్పోరేటర్ల బలం టిఆర్ఎస్ కే ఉండడంతో ఈ పీఠం అధికార పార్టీయే దక్కించుకోనుంది . ఇప్పటికే బరిలో గుండు అశ్రితారెడ్డి , నాగమళ్ల ఝాన్సి మహిళా కోటాలో పోటీపడుతుండగా . . గుండా ప్రకాశ్ రావుతో పాటు వద్దిరాజు గణేష్ , తదితరులు కూడా తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చశారు . సీఎం కేసీఆర్ ఆశీర్వాదం ఉండి . . పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆమోద ముద్ర వేస్తేనే మేయర్ అభ్యర్థిత్వం ఎవరికనేది ఖరారు కానుంది .