సీరియల్ నటి లహరి అరెస్ట్ అయ్యారు. మద్యం సేవించి వాహనం నడిపి, రోడ్డు ప్రమాదం చేసినందున లహరిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. వివరాల్లోకి వెళ్లితే: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేటు పెట్రోలింగ్ వాహనం నడిపే వ్యక్తి తన విధులు ముగించుకుని శంషాబాద్ వైపు వస్తుండగా లహరి కారు అతన్ని ఢీ కొంది. ఈ ప్రమాదంలో పెట్రోలింగ్ వాహనం నడిపే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగినా లహరి కారులోంచి బయటకు దిగలేదు. దీంతో వాహనదారులకు ఆమెపై మండిపడుతున్నారు.

స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కారుతో పాటు నటి లహరి‌ని పోలీస్టేషన్‌కు తరలించారు. ఇక ఈ ఘటనపై బాధితులు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. కాగ, లహరి చాలా సీరియల్స్‌లో నటించింది. ప్రస్తుతం గృహలక్ష్మిసిరియల్‌లో నటిస్తోంది.