మంగపేట: ములుగు జిల్లా మంగపేటలో గ్రామపంచాయతీ అధికారులు పబ్లిక్ నల్లాల ద్వారా సరాఫరా చేస్తున్న మంచినీటిలో చిన్న చేప పిల్లలు రావడంతో ప్రజలు ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రతీ రోజూ ఏదో ఒక వీధిలో నల్లాల నుంచి ఇలా చేప పిల్లలు వస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. శనివారం పోలీసు స్టేషన్ సమీపంలో కారుబోతుల గిరిబాబు అనే వ్యక్తి మంచినీళ్లు పడుతుండగా చేప పిల్లలు బయట పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇదిలావుండగా నల్లాల నుంచి వచ్చిన నీరు కూడా నీసు వాసన రావడంతో ఎవరూ నీళ్లు పట్టుకోలేదు. అంతేగాక నల్లాల నుంచి బురదనీరు కూడా వస్తుండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. నల్లా నీళ్లనుంచి చేప పిల్లలు రావడం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి గ్రామపంచాయతీ అధికారులు ఏమిచేస్తున్నారో అర్ధం కావడంలేదని, వారి నిర్లక్ష్యం వల్ల ప్రజలు వ్యాధుల భారినపడే అవకాశాలు ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు…